ఈ లక్షణాలు ఉంటే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..!!

Divya
మానవుని శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి అందులో ముఖ్యంగా..మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు కూడా ఒకటని చెప్పవచ్చు.. ఇది రక్తాన్ని శుద్ధి చేసి ఇతర భాగాల కు సైతం చేరవేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుత జీవసేవలి కారణంగా ఎంతో మంది కిడ్నీ సమస్యల తో ఇబ్బంది పడుతున్నారు. ఇక అంతే కాకుండా కిడ్నీ సంబంధిత సమస్యల మూలంగా ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం జీవనశైలి కారణంగా.. కిడ్నీ స్టోన్స్ లేదా కిడ్నీలో రాళ్లు చాలా సాధారణ సమస్యగా మారుతుంది కిడ్నీలో ఉండే రాళ్ల పరిమాణం పెరిగితే వాటిని తొలగించడానికి పలు రకాల చికిత్సలు చేస్తూ ఉంటారు వైద్యులు. అయితే మొదట్లోనే ఈ సమస్యను గుర్తించే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు ప్రస్తుతం వాటి గురించి చూద్దాం.



ముఖ్యంగా కిడ్నీ లో రాళ్లు ఉన్నట్లు అయితే శరీరంలో అనేక భాగాలలో చాలా నొప్పి కలిగిస్తాయట. ఈ సమస్యతో బాధపడే వ్యక్తులలో సహజంగా వెన్ను కడుపునొప్పి అనేది ఉంటుందట. సుదీర్ఘకాలంగా వెన్నునొప్పి కడుగునొప్పి .. తో బాధపడుతున్నట్లు అయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరము. ఇక అంతే కాకుండా మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట వచ్చినట్లు అయితే ఇది మూత్రణాలలో ఇన్ఫెక్షన్స్ కూడా సోకినట్లు గుర్తించవచ్చు ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.



ఇక అంతే కాకుండా మూత్రంలో రక్తం కనిపించిన మూత్రపిండాలలో రాళ్లు ఉన్నట్లుగానే అనుమానించాల్సి ఉంటుంది. దీనిని హేమాటోరియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఈ రక్తం ఎరుపు, గోధుమ రంగుల గుండె అవకాశం ఉంటుంది ఈ విధమైన లక్షణాలు కనిపించాయి అంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఇక మూత్రపిండాల సమస్య తో ఇబ్బంది పడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే పలు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: