పనస పండు గింజల వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
అయితే పనసపండు మాత్రమే కాకుండా పనస పండులో ఉండే విత్తనాలలో కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పనస పండు విత్తనాలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఇందులో క్యాల్షియం, పొటాషియం ,మెగ్నీషియం, వంటి ఇతర పోషకాలు కూడా ఇందులో బాగా లభిస్తాయి. అలసట ఎక్కువగా పడేవారు చర్మ సౌందర్యంతో ఇబ్బంది పడేవారు ఈ పనస గింజలను తరచూ తింటూ ఉన్నట్లు అయితే పలు ప్రయోజనాలు ఉంటాయి.
పనస గింజలలో ఎక్కువగా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది వీటిని తినడం వల్ల మన శరీరం రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
శరీర జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు పనస గింజలు కూడా చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
పనస పండు గింజలను ఉడికించి తిన్నట్లు అయితే.. అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.
కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు మొలకెత్తిన ఈ పనస గింజలను తినడం మంచిది.
పనస గింజలు నిత్యం తీసుకునే వారిలో ఎముకలు దంతాలు చాలా గట్టిగా మారుతాయి.
పనసపండు గింజలను తరచూ తిన్నట్లు అయితే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. అందుచేతనే కనీసం నెలలో ఒకసారి అయినా పనస పండును తింటూ ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.