గుడ్డులోని తెల్ల సొనను మాత్రమే తింటే ఇన్ని నష్టాలా..?
గుడ్డు తినడం వల్ల 14 రకాలకు పైగా విటమిన్లు.. పోషకాలు మనకు లభిస్తాయి. అయితే గుడ్డులోని పచ్చసొనను తింటే కొలెస్ట్రాల్ పేరుకుపోయి అనారోగ్య సమస్యలు వస్తాయని.. బరువు అధికంగా పెరుగుతారని అనే అపోహలు చాలామందిలో ఉండిపోయాయి. కాబట్టి పచ్చసొనను వదిలేసి కేవలం తెల్లసొనను మాత్రమే తింటున్నారు. ఇక తెల్ల సొనను మాత్రమే తినడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయా అనే విషయం ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది.. ఈ విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఇక గుడ్డులోని పచ్చసొనను వదిలేసి తెల్ల సొనను మాత్రమే తినడం వల్ల మనం ఎన్నో పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. నిజానికి పచ్చసొనను తినడం వల్ల.. కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, విటమిన్-డి పొందడానికి కూడా పచ్చ సొన చాలా అవసరం. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో పచ్చసొన చాలా బాగా పనిచేస్తుంది. గుడ్డులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె తో పాటు ఆరు రకాల బి విటమిన్లు మనకు లభిస్తాయి.. ఇక ఖనిజాల విషయానికి వస్తే.. జింక్ , ఐరన్, ఫాస్పరస్, కాల్షియం , ఫోలేట్ వంటివీ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ విటమిన్లు.. ఖనిజాలు పుష్కలంగా లభించాలి అంటే మొత్తం గుడ్డు తినాలి.. కేవలం తెల్ల సొన మాత్రమే తినడం వల్ల నష్టాలు తప్పవు..