వామ్మో.. అతిగా అరటిపండు తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవట..!!

Divya
అరటి పండ్లతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే.. జుట్టు సంరక్షణ మొదలుకొని చర్మ సంరక్షణకు, ఆరోగ్య సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.. అందుకే ప్రతి రోజూ ఒక అరటిపండు తినాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇకపోతే అరటి పండ్లతో ఎలాంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయో .. అదే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయట.. ఇకపోతే ఎవరూ నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం చదివే తెలుసుకుందాం..


అరటి పండ్లు  ఆకుపచ్చ.. పసుపు రంగు నుంచి నల్లటి మచ్చలు రూపంలోకి మారే టప్పుడు అవి చాలా తియ్యగా మారుతాయి.. అలా తియ్యగా ఉండే ఈ మచ్చల అరటి పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయి మీద అధిక ప్రభావాన్ని చూపుతాయి. డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నిజానికి అరటిపండ్లు పండే కొద్దీ గ్లైసెమిక్ ఇండెక్స్ రెట్టింపవుతుంది.. అందుకే అరటి పండ్లు పచ్చగా ఉన్నప్పుడే తినేయాలి.. అందుకే వైద్యులు సైతం డయాబెటీస్ రోగులకు అరటిపండ్లు తినవద్దని సిఫార్సు చేస్తారు. అధిక చక్కెర కలిగిన అరటి పండ్లను తినడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి..


 చాలా మంది పచ్చి అరటికాయలను తింటూ ఉంటారు. వీటి వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.. ఆకుపచ్చగా ఉండే అరటి కాయలు తినడం వల్ల పెక్టిన్ ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చ్ అనే మాలిక్యూల్స్ వల్ల తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది అందుకే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడతారు.. పచ్చి అరటి పండ్లు తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగితే మంచిది.. లేదంటే లూస్ మోషన్ , డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇకపోతే అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.. కాబట్టి ఆకలిని కూడా తగ్గించుకోవచ్చు. ఎవరైతే బరువు పెరగాలని అనుకుంటున్నారు అలాంటి వారి పై నెగిటివ్ ఎఫెక్ట్ ను చూపిస్తాయి..అన్నం తిన్న తర్వాత అరటిపండు తింటే కడుపు నిండిన భావన చాలా సేపు ఉంటుంది.. కాబట్టి మిగతా ఆహారం తినాలని అనిపించదు.. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది తప్ప బరువు పెరిగే అవకాశం అయితే అస్సలు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: