సిగరెట్ తాగే వారి పక్కనే ఉంటున్నారా.. ఇది తెలుసుకోండి?
సిగరెట్ తాగడం అనేది నేటి రోజుల్లో ఒక ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో చిన్న ల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ సిగరెట్ తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అని తెలిసినప్పటికీ ఎవరు జాగ్రత్త పడటం లేదు అని చెప్పాలి. అయితే సిగరెట్ తాగుతున్న వారు వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడమే కాదు పక్కన ఉన్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని నిపుణులు చెబుతూనే ఉన్నారు. సిగరెట్ తాగుతున్న వారి పక్కన ఉన్న వారు ఆ పొగను పీల్చడం వల్ల వారి కూడా ఇండైరెక్టుగా ఆరోగ్యానికి చేటు చేసుకున్నట్లు అవుతుందని అంటున్నారు నిపుణులు.
సాధారణంగా ఎవరైనా సిగరెట్ తాగుతుంటే పక్కనున్న వారు ఎవరో సిగరెట్ తాగితే మనకు ఏమవుతుందిలే అంటూ అనుకుంటారు. అలా అనుకున్నారు అంటే పొరపాటే.. ఎందుకంటే పక్కన ఎవరో సిగరెట్ తాగుతున్నప్పటికీ అతని బయటకి వచ్చే పొగ పీలిస్తే పక్కవాళ్ళ ఆరోగ్యానికి కూడ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది మరింత ప్రమాదకరం అంటూ చెబుతున్నారు నిపుణులు. చిన్నప్పుడు ఇతరులు వదిలిన సిగరెట్ పొగను పీల్చడం వల్ల ప్రభావానికి గురైన ఆడ పిల్లల్లో పెద్దయ్యాక కీళ్ల నొప్పులు తలనొప్పి ఎక్కువగా ఉంటుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది ధూమపానానికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు ప్రత్యక్ష సంబంధం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు. అందుకే సిగరెట్ తాగేవారి పక్కన ఉండకపోవడం ఎంతో మంచిది అని అంటున్నారు నిపుణులు.