ఉదయాన్నే శనగల్ని తీసుకుంటే పోషకాహార లోపం ఉండదు..!
ప్రోటీన్ మరియు ఐరన్ : శాకాహారులకు ప్రోటీన్ ఉండటం చాలా కష్టమైన పని ఆని అందరికీ తెలిసిన విషయమే. మనం ప్రతిరోజు శనిగల్ తీసుకోవడం కారణమైన మన శరీరానికి.. అనేక రకాల ప్రొటీన్లు అందుతాయి. మరీ ముఖ్యంగా అనీమియా సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు.. వీటిని తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. వీటిలో ఐరన్ ఎక్కువగా లభించడం కారణంగా మన శరీరంలో హిమోగ్లోబిన్ చాలా అభివృద్ధి చెందుతుంది.
జీర్ణ సమస్యలు తగ్గుతాయి : ఈ మధ్యకాలంలో అజీర్ణ సమస్యలతో... బాధ పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే... ఈ సమస్యలకు శనిగలతో చెక్ పెట్టవచ్చు. శరీరంలో ఉండేటువంటి ఫైబర్ కారణంగా మనం అజీర్ణ సమస్యలకు శాశ్వతంగా దూరం కావచ్చును.
నీరసం తగ్గుతుంది : శనిగల లో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్ మనకు చాలా ఎనర్జీ ఇస్తుంది. ముఖ్యంగా వీటిలో ఉండేటువంటి పోషకాలు మనకు ఆకలి కాకుండా చూస్తాయి. తద్వారా మనకు ఎనర్జీ లభించి నీరసం వంటి సమస్యలు దరికి చేరవు.
కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గిపోవచ్చు : మనం శనగలను ప్రతి నిత్యం తీసుకోవడం కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ గ్రూప్ పదార్థాలను కలిగిస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు కూడా మనకు రావు.