ఆరోగ్యానికి ఆవిరి మంచిదేనా ?

Divya

మనలో చాలా మందికి తెలిసిందేమిటంటే ఆవిరిని ఎక్కువగా సౌందర్య పద్ధతులలో మాత్రమే ఉపయోగిస్తారు అని. కానీ ఇప్పుడు ఈ ఆవిరి పట్టడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందట. కానీ ఇటీవల కాలంలో చాలామందిలో ఎన్నో అపోహలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టవచ్చా ? ఒకవేళ ఆవిరిపడితే, వైరస్ లోపలికి వెళ్తుంది అంట కదా. అది నిజమేనా? కళ్ల ద్వారా కూడా వైరస్ సోకుతుందా? తదితర అనుమానాలను కోఠి ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ టి శంకర్ నివృత్తి చేశారు.. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఆయన వివరించారు.


ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు పసుపు ,ఆకుపచ్చని టాబ్లెట్లతో ఆవిరిపట్టడం మంచిదే. ఆవిరి పట్టడం వల్ల ముక్కులో, గొంతులో, శ్వాసనాళాల్లో చేరిన వైరస్ లు ఏవైనా సరే అంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు పలురకాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఆవిరిపట్టడం మంచిదే అని అంటున్నారు డాక్టర్ టి శంకర్.

అంతేకాకుండా కరోనా సోకిన వారిలో మొదట జ్వరం ,ముక్కు ,గొంతుకు సంబంధించిన లక్షణాలు ,తలనొప్పి  వంటివి కనిపిస్తాయి. ఇక ఇవి కనిపించిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత వాసన తెలియక పోవటం చాలా మందిలో గుర్తిస్తున్నారు. ఇక కరోనా సోకిన వారం తర్వాత తిరిగి వాసన సాధారణ స్థితికి వస్తుంది. ఎవరైతే వాసన పోయిందని చెప్తున్నారో, వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. గొంతులో నొప్పి, గొంతు గరగర ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే  టెస్ట్ ల కోసం పరిగెత్తకుండా,  వైద్యున్ని సంప్రదించాలి. ఇక వారి సలహా మేరకు టెస్ట్ చేయించుకోవడం ,మందులు వాడడం వంటివి చేయాలి.


ముఖ్యంగా భయం అనేది మనిషిని కుంగదీస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి బయటపడేందుకు పలు జాగ్రత్తలతో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. ముఖ్యంగా రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి. నీళ్ళు బాగా తాగాలి .భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలి .ఎప్పటికప్పుడు చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా కరోనా ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తప్పనిసరిగా చేయించుకోవాలి అని అంటున్నారు డాక్టర్ టి శంకర్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: