మామిడి పండ్లు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?

praveen
ఎండాకాలం వచ్చిందంటే చాలు కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ప్రత్యేకంగా దొరుకుతుంటాయి.  ముఖ్యంగా ఎండాకాలంలో దొరికే పండ్లలో పుచ్చకాయ మామిడి పండ్లు ఉంటాయి. ఎండాకాలంలో వీటిని జనాలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా  మామిడి పండు అయితే ఎక్కువగా ఇష్టపడుతుంటారు జనాలు. అందుకే మామిడిపండు ఎక్కడైనా కనిపించింది అంటే చాలు అందరు నోరూరిపోతుంది. అందుకే ఎక్కువగా మామిడి పండ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కేవలం వేసవిలో దొరికే పండ్లు కావడంతో ప్రతి ఒక్కరు కూడా వేసవిలో మామిడిపండు టేస్ట్ చేయడానికి ఇష్ట పడుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే అటు మామిడి పళ్ళ వ్యాపారం వేసవిలో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగిపోతుంది.  అంతేకాదు ఎక్కడ చూసినా కూడా మామిడి పండ్లు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక పసుపుపచ్చని రంగులో దర్శనమిచ్చే మామిడి పళ్ళు నోరూరిస్తూ ఉంటాయి.  అందుకే ప్రతి ఒక్కరు మామిడి పండ్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మామిడి పళ్ళు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు గమనించాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో మామిడిపండ్లు సహజ రీతిలో కాకుండా కొన్ని కెమికల్స్ ద్వారా పండిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తద్వారా సహజ రీతిలో లేని మామిడి పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి.

 ఇంతకీ సహజ రీతిలో లేని మామిడి పండు గుర్తించడం ఎలా అని అంటారా. ఒకవేళ మామిడి పండ్ల పై తెల్లని పొర కనిపిస్తే అది కార్బైడ్ వేసి పండించినట్లు అన్నది గుర్తించాలి . సాధారణ పండు తో పోలిస్తే ఇక కార్బైడ్ తో పండించిన పండు బరువు ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నీళ్ళలో వేస్తే పైకి తేలుతూ ఉంటాయి. సహజ పండ్లు పండితే మెత్తగా ఉంటాయి అయితే కార్బైడ్ తో పండించిన పండు పూర్తిగా పండినట్లుగా ఉన్నప్పటికీ గట్టిగానే ఉంటాయి. మాములు పండ్లు పూర్తిగా ఒకే రంగులో ఉంటాయి కానీ కార్బాడ్ తో పండించిన పండ్లు మాత్రం అక్కడ అక్కడ వేరే రంగు కూడా కనిపిస్తూ ఉంటుంది.అంతే కాకుండా ఎక్కువ రుచిగా కూడా ఉండవు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: