పాదాల పగుళ్లు తగ్గాలంటే... ఈ అద్భుతమైన టిప్స్ ను పాటించండి...?

kalpana
 పాదాలు చలికాలంలో ఎక్కువగా పడుతుంటాయి.ఈ పగుళ్ళు తలనొప్పి గా ఉంటాయి. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇవి తగ్గడానికి ఎన్నో రకాల క్రీములను రాస్తూ ఉంటాం. అయినా నొప్పి మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్నిటి పాటించడంవల్ల కాళ్ళ పగుళ్లు నొప్పులను తగ్గించుకోవచ్చు. టిప్స్ ఏమిటో తెలుసుకుందాం..                                                            

 గోరింటాకును బాగా రుబ్బి పగుళ్లు ఉన్న చోటా రాసుకొని ఎండిపోయిన తర్వాత కడిగేసుకోవాలి.ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. అలాగే నొప్పి కూడా తగ్గుతుంది.

 పాదాల పగుళ్ళు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు రోజువాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని పగుళ్లు ఉన్న చోట దూదితో రాసుకొని కొంత సమయం తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉండడం వల్ల పాదాల పగుళ్ళు క్రమంగా తగ్గుతాయి.

 వేపాకు, పసుపు, సున్నము మూడింటిని కలిపి మెత్తగా రుబ్బుకొని అందులోకి ఆముదం కలిపి పాదాలకు రాసుకోవాలి. చేయడంవల్ల పాదాల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు మర్దనా చేయాలి. పాదాల పగుళ్లు తగ్గి, పాదాలు మృదువుగా ఉంటాయి.

 కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో నిమిషం పాటు పాదాల నానబెట్టాలి.తర్వాత గరుకు రాయి తీసుకొని పాదాలపై పెట్టడం వల్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.

 కాళ్లు పగుళ్లు ఉన్నవాళ్లు బొప్పాయి గుజ్జులో 4 చుక్కలు నిమ్మరసం కలిపి పాదాలకు మర్ధన చేయడం వల్ల పాదాల పగుళ్ళు నొప్పి తగ్గుతుంది.

ఆముదమును,కొబ్బరి నూనెను సమానముగా తీసుకొని అందులో కొంచెం పసుపు పొడి కలిపి పాదాలకు రాస్తూ ఉంటే పగుళ్ళు దూరమవుతాయి.

 రాత్రిపూట నిద్ర పోవడానికి ముందు పాదాలను శుభ్రంగా కడిగి కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల పగుళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: