తిప్పతీగ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Divya
తిప్పతీగ అంటే ఏంటి? దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ప్రస్తుత ప్రజలకు అయితే మరీను. తిప్పతీగ అనగానే ఒక పిచ్చి ఆకులే అనుకుంటారు. కానీ తిప్పతీగ యొక్క ప్రయోజనాలు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అధర్వణ వేదంలో తిప్పపువ్వునే అమృతవల్లి అనేవారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇమ్యూనిటీ కలిగిన మందు పనిచేస్తుందంటే ఈ తిప్పాకు రసాలను ఆ మందులలో వాడారని తెలుస్తోంది.

తిప్పతీగ గురించి తెలుసుకోవడానికి ఒక అధ్యయనం కూడా జరిగింది. ఈ అధ్యయనంలో తిప్పతీగ ఒక సంజీవని లాగా మన శరీరంలో పనిచేస్తుందని తేలింది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది. తిప్పతీగను ఆయుర్వేదంలో ముఖ్యమైన సంజీవనిగా పరిగణిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, క్యాప్సిల్స్ తయారుచేయడంతో పాటు తిప్పతీగ అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

తిప్పతీగ రసాన్ని కషాయంగా చేసుకుని త్రాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.అంతేకాకుండా తిప్పతీగలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి దీనికి ఉంది. అలాగే అజీర్తితో బాధపడుతున్నవారు ఈ తిప్పఆకు మందులు వాడితే జీర్ణ వ్యవస్థ పనితీరు సులభమవుతుంది. తిప్పతీగ ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా చక్కెర స్థాయిలను తగ్గించగలిగే శక్తి తిప్పతీగకు ఉంది.

తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం చేత, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ఆర్థరైటిస్ తో బాధపడేవారికి ఈ తిప్ప ఆకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పుల వారికి ఇది బాగా పని చేస్తుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ 19 ను ఎదుర్కోగలిగే ఇమ్మ్యూనిటి పవర్ ను పెంచటానికి ఈ తిప్పతీగ సంజీవనిలా పనిచేస్తుంది. తిప్పతీగకు ఇమ్మ్యూనిటి పవర్ ను పెంచే శక్తిలా పనిచేస్తుంది. ఇన్ని ఔషద గుణాలు కలిగిని తిప్ప తీగ ఆకును తప్పక ఉపయోగించుకుంటే జబ్బుల భారిన పడరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: