అందం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ చాలు..!!

Divya
ఈ చలికాలంలో ప్రధాన సమస్యలు అందం ఆరోగ్యం కాపాడుకోవడమే అని చెప్పొచ్చు.సీజన్ మార్పు వల్ల రెండూ దెబ్బ తింటూంటాయి. ఎన్ని క్రీములు రాసినా ఫలితం ఉండదు. మరియు ఆరోగ్యం కోసం రోగనిరోధక శక్తి చాలా అవసరం.మరియు రక్తహీనతతో బాధపడేవారిలో చర్మం అందంగా కనిపించదు.చర్మసౌందర్యాన్ని, రక్తహీనతను, రోగానిరోధక శక్తిని వంటి సమస్యలను ఒకేసారి తీర్చుకోవడానికి ఈ ఒక్క జ్యుస్ చాలు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఈ జ్యూస్ కోసం అర కప్పు బీట్ రూట్ ముక్కలు, ఒక చిన్న సైజ్ క్యారెట్ ముక్కలు, ఒక టమోటాను ముక్కలుగా చేసుకొని విటన్నిటిని కలిపి, తగినంత నీరు పోసి జ్యూస్ చేసుకోవాలి. తర్వాత దానిని వడకట్టి నిమ్మరసం, ఒక స్ఫూన్ తేనే కలిపి తాగాలి. దీనిని పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాక నీరసం తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్టీవ్ గా ఉంటారు. మరియు చర్మంలో కూడా మెరుపు సంతరించుకుంటుంది.దీనిని తరుచు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెరిగి, రక్తహీనత తగ్గుతుంది.రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం..
హై బీపీని కంట్రోల్ చేయడానికి..
ఈ జ్యూస్ రోజూ తాగడం వల్ల బీపీ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. హైబీపీతో బాధపడేవారు,దీన్ని తాగితే బీపీ అదుపులో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి,శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోకుండా బీట్ రూట్ జ్యూస్ సహాయపడుతుంది. దీనివల్ల గుండెసంబంధిత రోగాలు దరిచేరవు.ఈ జ్యూస్ లో వున్న పైబర్ బరువును అదుపులో ఉంచుతుంది.
రక్త హీనత తగ్గించడానికి..
గర్భిణిలు ఈ జ్యూస్ తాగడంవల్ల, వారికి కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందుతుందని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. పోలిక్ యాసిడ్ తగినంత తీసుకోవడం వల్ల,శిశువు పెరుగుదలకు తోడ్పడుతుంది. వారి నాడీ వ్యవస్థ బలపడి, మెదడు కణజాలం అభివృద్ధి చెందుతుంది.
కావున ఈ జ్యూస్ వల్ల అందం, ఆరోగ్యం రెండూ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: