
10 గ్రాముల బంగారం అక్షరాలా లక్ష .. పక్కా రాసిపెట్టుకోండి..!
బుధవారం అమెరికా ఫెడ్ రిజర్వే వడ్డీ రేట్లు తగ్గించకపోవడంపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది . దీని కారణం చేత కూడా పసిడి రేట్ల కు ఆద్యం పోసినట్లు అయ్యాయి . ఇక తాజాగా పరిణామంతో దేశీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం మరింత పెరగవచ్చని తెలిపాయి . మరోవైపు ఢిల్లీలో గురువారము పసిడి కొత్త జీవితకాలం గరిష్టాలను తాకడం జరిగింది . 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర 50 రూపాయలు పెరిగి రూ. 83,800 కు చేరడం జరిగింది .
బుధవారం 10 గ్రాముల ధర 910 లాభపడి 83,800 కు చేరిన సంగతి తెలిసిందే . 99.5 స్వచ్ఛత బంగారం సైతం 50 పెరిగి 83,400 కు చేరింది . మరోవైపు వెండి డిమాండ్ కూడా పెరిగింది . కొనుగోళ్ల మద్దతుతో కిలోకి ఏకంగా 1150 పెరిగి రూ. 94,150 కి చేరింది . ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం నూతన గరిష్టాలను నమోదు చేసింది . ఇక రానున్న రోజుల్లో బంగారం ధర లక్షకి చేరనుంది . లక్షకి చేరిన ఎటువంటి ఆశ్చర్యం అవసరం లేదు . ఎందుకంటే ప్రస్తుతం బంగారం డిమాండ్ అలా ఉంది మరి . మరి ఏం జరగనుందో వేచి చూడాలి.