గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు
కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఈరోజు 1.04% పడిపోయింది. $1783.9 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే స్పాట్ గోల్డ్ ధరలు కూడా 0.83% పడిపోయాయి. నిన్న చివరిగా ట్రేడింగ్ అయ్యే వరకు $1785/oz వద్ద కోట్ అయ్యాయి. మరోవైపు స్పాట్ మార్కెట్‌లో అమెరికా డాలర్ ఇండెక్స్ 94.14గా ఉంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం కూడా 0.74% పడిపోయింది. చివరి ట్రేడింగ్ వరకు రూ. 47,607/10 గ్రాములకు చేరుకుంది. నిన్న అక్టోబర్ చివరి ట్రేడింగ్ డే. నిన్న అక్టోబర్ 30, శనివారం ఫ్యూచర్స్ మార్కెట్ క్లోజ్ అయ్యింది.
ప్రస్తుతం US ద్రవ్యోల్బణం దాదాపు 5.4% వద్ద ఉంది. ద్రవ్యోల్బణం 15%కి చేరుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారు నిపుణులు. ఏది ఏమైనప్పటికీ ద్రవ్యోల్బణం ఆ స్థాయిలో కొనసాగితే లేదా పెరిగినట్లయితే, వడ్డీ రేటును పెంచడం లేదని పరిగణనలోకి తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరగడం ఖాయం. అయినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి US ఫెడ్ వడ్డీ రేటును పెంచితే, అప్పుడు బంగారం ధరలు తగ్గవచ్చు. కాబట్టి విశ్లేషకులు ప్రస్తుతానికి మార్కెట్‌ను అంచనా వేయడానికి సకాలంలో US ఫెడ్ ఏం చేయబోతుందా అని వేచి చూస్తున్నారు. తగ్గుతున్న బంగారం ధర సాధారణ భారతీయ కొనుగోలుదారులకు రాబోయే రోజుల్లో మరింత బంగారాన్ని కొనడానికి సహాయపడుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవలి నివేదికలో భారతదేశంలో బంగారు ఆభరణాల డిమాండ్ Q3లో 60% పెరిగిందని పేర్కొంది. కాబట్టి బంగారం వ్యాపారానికి ఇది సానుకూలం.