డాకు మహారాజ్ కోసం పుష్ప రాజ్.. నాగ వంశీ గట్టిగానే ప్లాన్ చేశాడుగా..!
డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్ర ప్రదేశ్ లో గ్రాండ్గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు .. ఈవెంట్ ఎప్పుడు అనేది కచ్చితంగా తెలియదు కానీ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తారని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక గతంలో అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్నీ గెస్ట్ గా వచ్చారు మళ్ళీ ఇప్పుడు బాలయ్య కోసం గెస్ట్ గా రాబోతున్నారని కూడా అంటున్నారు .. ఇక డాకు మహారాజ్ కోసం పుష్ప రాజ్ వస్తాడని వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
ఎందుకంటే సంధ్య థియేటర్ తొక్కిసులాట గట్టిన తర్వాత జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ పెద్దగా బయట కనిపించడం లేదు .. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఎవరు ఊహించని విధంగా ఓ మహిళ చనిపోవడం దీని కారణంగా అల్లు అర్జున్ మీద కేసు నమోదు అవటం ఆయన జైల్లోకి వెళ్ళటం .. అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ మద్యంత బెయిల్ మీద ఉన్నారు .. ఇప్పటికే పుష్ప2 సక్సెస్ సెలబ్రేషన్ను భాగంగా ప్లాన్ చేసుకున్న ఈవెంట్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఇలాంటి సమయంలో ఒక పబ్లిక్ ఈవెంట్ కు బన్నీ గెస్ట్ గా వస్తారో లేదా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది .. ఇక డాకు మహారాజ్ చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుంది.
ఇక డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ , సౌజన్య నిర్మిస్తున్నారు .. తమన్ సంగీతం అందిస్తున్నారు .. ఇక సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ , వీర సింహారెడ్డి భగవనంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాలతో బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు .. మరోవైపు వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్నారు బాబి .. మరి ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి ..