ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన జబర్దస్త్ జంట.. విడిపోయినట్టేనా..?

Divya
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి వారిలో వర్ష, ఇమ్మానుయేల్ జోడి కూడా ఒకటని చెప్పవచ్చు. చాలామంది వీరి కోసమే స్కిట్లను కూడా చూస్తూ ఉన్నారు. ఇక స్టేజ్ మీద ఇప్పటికే రెండు మూడు సార్లు వీరికి వివాహం కూడా చేయించడం జరిగింది మల్లెమాల సంస్థ. అయితే వీరు నిజజీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లుగా చాలామంది భావించుకున్నప్పటికీ కానీ వీరిద్దరూ మాత్రం తామిద్దరూ కేవలం మంచి స్నేహితులమే అంటూ తెలియజేశారు.

ఇమ్మానుయేల్, వర్ష తాజాగా ఒక షోలో చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఏడాది ఎలా గడిచిందో అందరూ చెప్పాలని షోలో యాంకర్ అడగగా.. వర్ష ఇలా మాట్లాడుతూ ఈ ఏడాది లాంటి ఇంకో ఏడాది తనకి అసలు ఉండకూడదని ఎమోషనల్ గా మాట్లాడింది. తన జీవితంలో 2024 లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదనుకుంటున్నానని తెలిపింది. ఎందుకంటే మనకు ఇష్టమైన వ్యక్తితో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే చాలు కొంచెం కూడా తట్టుకోలేము అలా ఈ ఏడాది తనకు ఇమ్మానుయేల్ కి చాలా సార్లు గొడవలు అయ్యాయని దీంతో ఒకరినొకరు నెంబర్స్ బ్లాక్ చేసుకున్నామని కన్నీళ్లు పెట్టుకుంది వర్ష.

ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారు వీరి మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తేయని విషయం తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది.. ఇమ్మానియేల్ ప్రస్తుతం పలు రకాల టీవీ షో లతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇక వర్ష మాత్రం అడపాదడపా బుల్లితెర పైన షోలలో కనిపిస్తూ బిజీగా ఉన్నది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ కూడా ఎందుకో సినిమాలలో అవకాశాలు రావడం లేదు వర్షకు. మరి వీరిద్దరూ కూడా లవ్ బ్రేకప్ చేసుకున్నారా లేకపోతే స్కిట్ కోసం ఇలా చేశారనే విషయం తెలియాల్సి ఉన్నది. అసలు కథ ఏంటన్నది ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: