గీత గోవిందం లో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ నా? చూస్తే పిచ్చెక్కి పోతారుగా..?

Amruth kumar
రౌడీ హీరో విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న‌ జంటగా నటించిన దర్శ‌కుడు పరశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం అందుకోవ‌టే కాదు అటు విజయ్ కు, ఇటు రష్మికకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది .. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండను ప్రేమించే స్టూడెంట్ క్యారెక్టర్ నటించిన అమ్మాయి గుర్తుండే ఉంటుంది ? ఈ సినిమాలో విజయ్ కాలేజ్ లెక్చరర్ గా కనిపిస్తే ప్రేమ అంటూ అతని వెంటపడే అమ్మాయి క్యారెక్టర్లు నటించింది ఓ ముద్దుగుమ్మ .. ఎంతో ఇన్నోసెంట్‌గా తన కళ్ళతో హావభావాలను పలికించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది .. సత్తి గాని రెండు ఎకరాలు , పెళ్లికూతురు పార్టీ లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది .. మరి ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు అని అనుకుంటున్నారా.

ఇంతకీ ఆ బ్యూటీ మరెవరో కాదు .. అనీషా దామా .. 2014 లో వయా పాపికొండలు అనే సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ .. ఆ తర్వాత 2017లో అర్జున్ రెడ్డి సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించింది అనిషా.. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి అర్జున్ రెడ్డి విజయం తో అనుషాకు వరుసగా భారీ అవకాశాలు వచ్చాయి .. గీత గోవిందం , మహర్షి , ఓ బేబీ, ఆల్ అబౌట్ మిచెల్’ వంటి సినిమాల్లో తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.

ఇక ఆ తర్వాత పెళ్లికూతురు పార్టీ , సత్తి గాని రెండు ఎకరాలు సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు రాలేదు .. అలాగే సైతాన్ అనే వెబ్ సిరీస్లో కామియో రోలోల్‌ కూడా చేసింది అనిషా .. ఇక ఇప్పుడు తాజాగా డ్రీమ్ క్యాచర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.. అనీషా కు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ .. క్రేజీ లుక్స్ తో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది . ఇక మరి ఈ బ్యూటీ రాబోయే రోజులైనా అగ్ర‌ హీరయిన్ గా మారుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: