మళ్ళీ డబ్బింగ్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. కన్ఫ్యూషన్ లో ఫ్యాన్స్..!!

murali krishna
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 05న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1,7308 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.ఇందులో బాలీవుడ్‌లోనే సుమారుగా రూ. 800 కోట్లకు పైగా రాబట్టి పాత రికార్డులన్నీ కొల్లగొట్టింది. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పుష్ప 2 టీమ్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతోంది. ఇదే కేసులో అల్లు అర్జున్ కూడా ఏ11 గా ఉండడంతో ఎలాంటి సక్సెస్‌ టూర్స్‌ ప్లాన్‌ చేయలేదు. అయితే లవర్స్ కు ఉత్సాహానిచ్చేలా పుష్ప 2 లో సీన్లు జత చేయనున్నారని తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుంచి థియేటర్లలో కొత్త సీన్లతో పుష్ప 2 ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఈ సన్నివేశాలకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ పనులు జరుగుతున్నాయని సమాచారం. కాగా పుష్ప 2 రన్‌టైమ్‌ సుమారు 3 గంటల 15 నిమిషాలు ఉండటం వల్ల కథలో చాలా ముఖ్యమైన సీన్లను ఎడిటింగ్‌లో తొలగించారట. 

ఇప్పుడు వీటిని తిరిగి జత చేయనున్నారట. సుమారు 20 నిమిషాల సీన్లు కలపనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఓటీటీ వర్షన్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇంకా సమయం ఉండడంతో థియేట్రికల్ వెర్షన్ లోనే వీటిని జతచేయనున్నారని సమాచారం.పుష్ప కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.ఇదిలా ఉండగా ఈ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్  దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఆ సినిమాల షూటింగ్ మొదలు పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: