స్పెషల్ రోల్‌కు కొరటాల స్కెచ్.. ‘దేవర 2’లో బిగ్ సర్ప్రైజ్!

Amruth kumar
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. "భయం తెలియని వాడికి భయం పరిచయం చేస్తా" అంటూ ఎన్టీఆర్ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇక ఇప్పుడు అందరి కళ్ళూ ‘దేవర పార్ట్-2’ పైనే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైని మించి సెకండ్ పార్ట్ ఉండబోతోందని వస్తున్న వార్తలు నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.



తారక్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసినట్లుగా, ‘దేవర సీక్వెల్’ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్ నుంచే సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసేశాడు. ఫస్ట్ పార్ట్ కంటే కథలో మరిన్ని ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కొరటాల స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేశారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ఆడియన్స్‌ను మెప్పించేలా భారీ విజువల్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సీక్వెల్‌లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే.. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం కొరటాల శివ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట. ఈ పాత్ర కోసం తమిళ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, ఎన్టీఆర్ మరియు విజయ్ సేతుపతిని ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఫ్యాన్స్‌కు అతిపెద్ద ఐ-ఫీస్ట్ అవుతుంది. ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్.


‘దేవర’ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌లో అనిరుధ్ మ్యూజిక్ పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘ఆయుధ పూజ’ నుంచి ‘చుట్టమల్లే’ వరకు ప్రతి సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు అనిరుధ్ సీక్వెల్ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడట. సెకండ్ పార్ట్ కోసం మరింత ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రెడీ చేస్తున్నాడని సమాచారం. అనిరుధ్ ఇచ్చే ఆ మ్యూజిక్ మోతకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా మెరిసిన ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల మధ్య ఉండే ఆ ఎమోషన్ మరియు రివెంజ్ డ్రామా సీక్వెల్‌లో మరో లెవల్‌కు వెళ్లనుందని మేకర్స్ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: