సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ మృతి..!
ఆశా బోస్లే ఎవరో కాదు లతా మంగేష్కర్ సోదరి. 2022 ఫిబ్రవరి 6వ తేదీన లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. ఆశాభోస్లే మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే చిన్న ప్రాంతంలో జన్మించింది. ఈమె కుటుంబం కూడా సంగీత కుటుంబం . ఈమె తండ్రి దినానాధ్ మంగేష్కర్ నటుడే, ఇక ఈమె తల్లి స్రవంతి మంగేష్కర్ తో పాటుగా కుటుంబ సభ్యులు గాయకులుగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఆశాభోస్లే ఏడుసార్లు ఫిలింఫేర్ ఉత్తమ నేపద్య గాయనిగా అవార్డులు అందుకున్నది.
ఆశాభోస్లే ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు ఈమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణం వల్ల నిన్నటి రోజున హాస్పిటల్లో చేరగా నేడు చికిత్స తీసుకుంటూనే ఈరోజు మధ్యాహ్నం మరణించారు. అయితే నిన్నటి రోజు నుంచి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వినిపించినప్పటికీ అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు ఆమె కోలుకోవాలని కోరుతున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ బోస్లే తన తల్లి మరణ వార్తను అధికారికంగా ప్రకటించారు. 8 దశాబ్దాలకు పైగా 20 కి పైగా భాషలలో కొన్ని వేల పాటలు పాడింది ఆశా భోస్లే. ఆశా భోస్లే అంతిమ సంస్కారాలు రేపు ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ అధికారు లాంఛనాలతో నిర్వహించబోతున్నారు.