మెగాస్టార్‌కు అల్ట్రా స్టైలిష్ మేకోవర్.. బాబీ ప్లాన్ మామూలు గా లేదు గా..!
ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. ఇందుకోసం మెగాస్టార్ తన లుక్‌ను పూర్తిగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్, డ్రెసింగ్ స్టైల్ విషయంలో బాబీ చాలా కేర్ తీసుకుంటున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ ఇప్పుడు మెగాస్టార్ కోసం ఒక సరికొత్త స్టైల్‌ను డిజైన్ చేస్తున్నారట. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ రోజుల్లో చిరు ఎంత స్టైలిష్ గా ఉండేవారో.. అంతకంటే పది రెట్లు స్టైలిష్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారని టాక్!‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్ చిరంజీవిని చూపించి ఫ్యాన్స్‌ను మెప్పించిన బాబీ, ఈసారి స్టోరీని మరింత కొత్తగా డిజైన్ చేశాడట. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని సమాచారం. చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నంలో బాబీ ఈ కథను రాసుకున్నాడు. మెగాస్టార్‌ను ఒక కొత్త డైమెన్షన్‌లో చూడటానికి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాల్సిందే.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, చిరు కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. మెగాస్టార్ రేంజ్‌కు తగ్గట్టుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని తెలుస్తోంది.గతంలో చిరు-బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మళ్ళీ అదే కాంబో సెట్స్ పైకి వెళ్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చిరంజీవి స్టైల్, బాబీ మాస్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు మళ్ళీ తిరగరాయాల్సిందే!