పిఠాపురం తాలూకా: తండ్రికి తగ్గ కూతురు... ఆటోలో ఆద్య?
ఈ ఎన్నికలలో జనసేన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలలో పోటీ చేసి...అన్ని చోట్లు విజయం సాధించింది. దాదాపుగా అన్ని చోట్ల జనసేన అభ్యర్థులు బంపర్ మెజారిటీతో విజయాన్ని సాధించారు. పిఠాపురంలో ఏకంగా 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ . ఇదిలా ఉండగా, పవన్ బాటలోనే ఆయన కూతురు ఆధ్య కూడా నడుస్తోంది. సింప్లీసిటీలో తండ్రికి తగ్గ కూతురు అనిపిస్తోంది.
ఇందుకు నిదర్శనమే ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. తాజాగా తల్లి రేణు దేశాయ్ తో కలిసి కాశి యాత్రకు ఆద్య వెళ్ళింది. అక్కడ సింపుల్ గా ఆటో రిక్షాలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కారులో ప్రయాణం చేసే స్టేటస్ ఉన్నప్పటికీ తన తల్లితో కలిసి సాదాసీదాగా ఆటోలో ప్రయాణం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారుతుంది.
ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆధ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సింప్లీసిటీలో తండ్రికి తగ్గ తనయ అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆద్య చూడడానికి చాలా అందంగా, సాంప్రదాయంగా ఉంటుంది. ఆధ్య ప్రస్తుతం తన చదువును కొనసాగిస్తోంది. సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతూ ఉంటుంది ఆధ్య. మరి రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.