షాక్: ఆ పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ.. కారణం..?
ఇక స్వాతి ఇన్స్టిట్యూట్లో ఈ క్వశ్చన్ పేపర్ ఒక వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా బోర్డు అధికారులు గుర్తించారు. పాలిటెక్నికల్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపు లో బాగా వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అని తెలియజేశారు అధికారులు. ఇక ఆ తర్వాత అధికారులు ఈ వ్యవహారంపై ఆ కాలేజీపై, పోలీసులకు కంప్లైంట్ చేయడం కూడా జరిగిందట.. దీంతో పోలీసులు స్వాతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులను మరొక కాలేజీ కూడా బదిలీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక ఆ కాలేజ్ కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ ను కూడా రద్దు చేసే విధంగా ఆలోచనలో ఉన్నారు అధికారులు.
ఇక ఈ క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది అనే విషయంపై చాలా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యాలు కూడా విచారించడం జరుగుతోంది. అయితే మెదక్ లోని చేగుంట పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షకు విద్యార్థులు హాజరు కాకుండా సెల్ ఫోన్ లోనే ఎక్కువ చూస్తూ ఉండడంతో ఈ ఘటన బయటపడినట్లు సమాచారం. అయితే సదరు విద్యార్థుల పై అనుమానం వచ్చి మొబైల్ చెక్ చేయగా.. దీంతో వారికి ఈ ప్రశ్న పాత వాట్సాప్ లో లీక్ అయినట్లుగా వెలుగులోకి వచ్చింది.