లక్ష మంది టీచర్స్ లో అయోమయం.. ఎందుకో తెలుసా..!

MOHAN BABU
అనేక గందరగోళాల మధ్య ఎట్టకేలకు టీచర్ల కొత్త జిల్లాల అలకేషన్ ప్రక్రియ పూర్తయింది. సర్కారు చేయాలనుకుందే చేసింది. టీచర్లకు జిల్లాల అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసింది. సెల్ ఫోన్లకు అలాట్మెంట్ మెసేజ్ వచ్చిన మూడు రోజుల్లో కేటాయించిన జిల్లాలో రిపోర్టు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఆదేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నా అలాటైనా జిల్లాలో రిపోర్టు చేసిన తర్వాత ఏం చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క కొత్త జిల్లాల్లో ఎప్పుడు పోస్టింగులు ఇస్తారో చెప్పడంలేదు. దీంతో లక్ష మంది టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ముందుగా మీడియం, కేడర్, సబ్జెక్టుల వారీగా సీనియార్టీ లిస్టులు ప్రకటించిన తర్వాత ఆప్షన్లు తీసుకోవాలి.కానీ అదేదీ పట్టించుకోకుండా ఫైనలిస్టులు ఇవ్వకుండానే ఆప్షన్లు తీసుకున్నారు.తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చినా,ఆఫీసర్లు  పట్టించుకోలేదు.

చివరిగా రెండు రోజుల నుంచి జిల్లాల అలాకేషన్ ప్రాసెస్ మొదలై బుధవారంతో పూర్తయింది.ఇప్పటికే టీచర్లకు అలాటైన జిల్లాల వివరాలతో కూడిన మెసేజ్ లు వచ్చాయి. గురువారం కూడా కొంతమందికి మెసేజ్ లు పంపించారు. వాటిలోంచి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకొని, అలాటైన జిల్లాలో డీఈఓ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని టీచర్లకు ఆఫీసర్లు సూచించారు.ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై డిఇఓ లతోపాటు డైరెక్టరేట్లలోనూ ఎవరికీ క్లారిటీ లేకపోవడం అందర్నీ గందరగోళానికి గురి చేస్తోంది. కొత్త జిల్లాలకు అలాటైన టీచర్లకు పోస్టింగులు వెంటనే ఇస్తారా లేదా అనే దానిపై ఆఫీసర్లు స్పష్టత ఇవ్వడం లేదు. దీని కోసం సర్కారు ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇస్తుందని చెపుతున్నారు. ఆ గైడ్ లైన్స్ వచ్చేవరకు టీచర్లు ఏ స్కూల్ పోవాలనే దానిపై ఆఫీసర్లు చెప్పడంలేదు. హెడ్మాస్టర్ల అలాట్మెంట్ కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో రిపోర్టు చేయాలని మాత్రమే చెప్పారు, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని,అప్పటివరకు టీచర్లు వెయిట్ చేయాలని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అయితే అప్పటి వరకు పాత స్కూల్ లోనే పని చేయాలా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: