చంద్రబాబు అసలు అప్పులు చేయడం లేదా? ఎల్లో మీడియాలో కనిపించడం లేదే?

ఏపీ అప్పులు కుప్ప అని  ప్రతి రోజూ కనిపించే హెడ్ లైన్స్ ఇప్పుడు కనుమరుగు అయ్యాయి. వైసీపీ అయిదేళ్ల పాలనలో ఏపీ ఏపీ శ్రీలంక అవుతుందని పాకిస్థాన్ లా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని ఎన్నో భయానక స్టోరీలు రాసి కోట్లాది ప్రజలను కలవరపరిచిన మీడియా ఇప్పుడు నిర్లిప్తంగా కూర్చున్నారా అనే చర్చ పెద్దగా సాగుతోంది.


ఏపీ ఏమైపోతుందో అన్న వేదాంతమా లేక ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందనే నిబ్బరమరా లేక ఇప్పుడు అస్మదీయ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని జోలికి పోవద్దు అన్న ముందు జాగ్రత్త తో కూడిన విధేయతా అన్నది కూడా ప్రశ్నలుగా ఉంది. ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉంది అని పాడిన పాటే కూటమి పెద్దలు పాడుతున్నారు. అందులో కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చి చేసిన అప్పు వాటా ఎంతో కూడా తెలియాలి కదా అని అంటున్నారు విశ్లేషకులు.


ఏపీ ప్రజలకు రాష్ట్రం మీద సర్వ హక్కులు ఉన్నాయి. పార్టీలు ప్రభుత్వాలు మధ్యలో వచ్చి పోతూ ఉంటాయి.  ఇక కట్టే పన్ను నుంచి ఎంత ఆదాయం వస్తుంది ఎంత అప్పులు అన్నది కూడా నిజాయితీతో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మీడియాపై ఉందని అంటున్నారు.


ఏపీకి ఉన్న అప్పులు మూడు నెలల కాలంలో చూసుకుంటే జూన్ లో రెండు వేల కోట్లు, జులై 2న అయిదు వేల కోట్లు, జూలై 16న రెండు వేల కోట్లు, జులై 30న మూడు వేల కోట్లు, ఆగస్టు 27న మూడు వేల కోట్లు, సెప్టెంబరు 3న నాలుగు వేల కోట్ల ను కూటమి ప్రభుత్వం చేసిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. ఇప్పుడు ఇన్నేసి వేల కోట్లు అప్పు చేసినా ఎల్లో మీడియాలో ఎక్కడా కూడా వార్త కనిపించడం లేదని విమర్శించారు. వైసీపీ అప్పు చేస్తే తప్పు.. కూటమి చేస్తే అసలు ఎక్కడా కనిపించని వార్తగా ఉండటమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: