చంద్రబాబుకి మేలు చేస్తున్న నితీశ్ .. ! ఇక బాబుకి తిరుగులేదా?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఎన్డీయేలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడీయూ పక్క చూపులు చూసేందుకు యత్నిస్తోంది. ఎప్పుడు ఏ కూటమిలో ఎక్కువ కాలం ఉండని జేడీయూ… అలాగే ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియని నితీశ్ కుమార్ ఇటీవల కాలంలో ఆర్జేడీకి మాత్రం బాగా దగ్గరగా ఉంటున్నారు. ఇవి బీజేపీలో అలజడి రేపుతోంది. పైకి సాధారణ సమావేశం అని జేడీయూ నేతలు చెబుతున్నా.. నితీశ్ కుమార్ ని నమ్మడానికి లేదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


లాలూ ప్రసాద్ యాదవ్ తో సమావేశం కావడం, తేజస్వీ యాదవ్ తో గంటల తరబడి చర్చించడం వంటివి బహిరంగంగానే చేస్తున్నారు. ఆయన తీరుతో బీజేపీలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీయూ కూడా కీలకమే. టీడీపీ తర్వాత అత్యధిక ఎంపీలు ఉంది  ఆ పార్టీకే.


అయితే రాజకీయాల్లో ఓ స్టాండ్ అంటూ ఏమీ లేకుండా ఇండియా, ఎన్డీయే కూటముల మధ్య అటూ ఇటూ తిరిగే నితీశ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. బీజేపీతో అంటీ ముట్లన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఎక్కువ సీట్ల కోసం బీజేపీని బ్లాక్ మెయిల్ చేసేందుకా.. లేక.. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీని తట్టుకునే వ్యూహమా అర్థం కావడం లేదు. ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ తో కలవాలాని అనుకుంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి.


ఇక జేడీయూ కూటమి నుంచి వెళ్లిపొయినా కేంద్రానికి వచ్చే సమస్యేమీ లేదు. కానీ చంద్రబాబు ప్రయారిటీ మాత్రం మరింత పెరుగుతుంది. అప్పుడు కూటమి చంద్రబాబు మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది చంద్రబాబు కి మేలు చేకూరుస్తూ.. ఆయన స్థాయిని ఎన్డీయే కూటమిలో పెంచుతుంది. నిలకడలేని నితీశ్ పై బీజేపీ కూడా పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. చంద్రబాబుపై మాత్రం నమ్మకం బాగా ఉంచుతోంది. చూద్దాం మరి చివరకు నితీశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: