"క" హిట్.. ఏకంగా స్టార్ హీరోలకు పోటీగా కిరణ్ అబ్బవరం.. వర్కౌట్ అయ్యేనా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన వరుస పెట్టి అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకోగా చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

దానితో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. అలాంటి సమయంలోనే ఈయన "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు భారీగా పెరిగాయి. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు దిల్ రూబా అనే సినిమాను హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ యొక్క టీజర్ను వచ్చే సంవత్సరం జనవరి 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి.

ఈ మూడు మూవీలకు సంబంధించిన ట్రైలర్లను కూడా వచ్చే సంవత్సరం జనవరి మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోల ట్రైలర్లతో పాటు టీజర్ను కిరణ్ అబ్బవరం తాను హీరోగా రూపొందుతున్న దిల్ రుబా మూవీ టీజర్ను విడుదల చేయనున్నాడు. మరి ఈ సినిమ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: