బికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..!
చికెన్ బోన్స్ తినటం మంచిది కాదు అని. కానీ చికెన్ బోన్స్ తినటం మంచిదే అంటున్నారు నిపుణులు. కానీ, అది బ్రాయిలర్ చికెన్ బోన్స్ కాదంటున్నారు. నాటు కోడి బోన్స్ తినటం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. నాటుకోడి బోన్ మజ్జలో కొల్లాజన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోసమైన్ తో సహ అనేక ప్రోత్సాహకసమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి మనలో వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. మన చర్మ ఆరోగ్యానికి, కీళ్ల పనితీరుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. చికెన్ బోన్స్ మూలుగ లో ఖనిజాలు జింక్, ఐరన్, కాలుష్యం మరియు సెలీనియం ఉంటాయి.
ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఇస్తాయి. చికెన్ బోన్స్ లో విటమిన్లు A, B, విటమిన్లు B1, B5, B7 కూడా ఉన్నాయి. ఇది జీవక్రియ, శక్తి మార్పిడికి సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలను కలిగి ఉండే గ్లైసిన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. నాటుకోడికి చెందిన బోన్ మారో తినటం మంచిదేనని ఇందులో మంచి పోషకాలు మన శరీరానికి ఎంత గానం దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే బ్రాయిలర్ చికెన్ కు ఇచ్చే ఇంజక్షన్ల కారణంగా వాటి బోన్స్ తినటం మంచిది కాదని చెబుతారు. బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగటం కోసం వాటికి ఇంజక్షన్లు చేస్తారు.