ఏపీలో ఆ నిర్ణయంతో మళ్లీ రియల్‌ఎస్టేట్ బూమ్?
గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంపు ఉంటుందని మంత్రి అనగాని తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువలు 15 నుంచి 20 శాతం వరకు పెంచుతామని మంత్రి అనగాని అన్నారు. జనవరి 15 నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశం ఇచ్చారు. తొలిసారి కొన్ని భూమి రిజిస్ట్రేషన్ విలువలు తగ్గిస్తున్నామని కూడా మంత్రి అనగాని చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపు, తగ్గింపు ఉండదని చెప్పారు. అంతే కాదు.. గతంలో ఇష్టానుసారం పెంచిన రిజిస్ట్రేషన్ విలువలను సరిచేస్తామని కూడా మంత్రి అనగాని వివరించారు.