స్మైల్ డిప్రెషన్ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ప్రమాదమేనా..!
లోపల నుండి అతను నిరాశతో పోరాడుతున్నప్పుడు, దానిని ఎదుర్కొంటున్న వ్యక్తులు తరచుగా సామాజిక ఒత్తిడి కారణంగా లేదా ఇతరుల ఆనందాన్ని కాపాడుకోవడానికి తమ భావాలను దాచిపెడతారు. గుణులు తెలిపిన వివరాలు ప్రకారం... స్మైల్ డిప్రెషన్ కొన్ని సాధారణ లక్షణాలు ఎక్కువగా నిద్రపోవటం, శక్తి లేకపోవడం, అదిగా తినటం. ఇది కాకుండా వ్యక్తి తన ముఖంలో చిరునవ్వును కొనసాగించేటప్పుడు కూడా ఒంటరిగా, నిరాశకు గురవుతాడు. చాలాసార్లు ఈ వ్యక్తులు తాము అనుభవిస్తున్న నొప్పి గురించి ఇతరులకు చెప్పడానికి భయపడతారు. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
స్మైల్ డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా శారీరక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. వృత్తి జీవితంలో కూడా సమస్యలను సృష్టిస్తుంది. నిరంతరం బాగోద్వేగాలను దాచడం వల్ల వ్యక్తి అలసిపోయి ఒత్తిడికి గురవుతాడు. పరిస్థితి కొన్ని సార్లు ఆత్మహత్య వంటి ప్రమాదకరమైన ఆలోచనలకు కూడా దారితీస్తుంది. స్మైల్ డిప్రెషన్కు సరైన సమయంలో చికిత్స చేయవచ్చు. దీనికోసం వ్యక్తి తన భావాలను పంచుకోవడం, మానసిక ఆరోగ్య నిపుణుడి నుండి సహాయం తీసుకోవటం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామాలు, సమతుల్య ఆహారం, ధ్యానం వంటి చర్యలు కూడా సహయకారిగా ఉంటుంది. ఈ పరిస్థితి నుండి కోల్పోవడంలో కుటుంబం, స్నేహితుల మద్దతు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.