వార్ 2 ఎన్టీఆర్ నుంచి ఊహించ‌ని స‌ర్‌ఫ్రైజ్ ఇది... !

RAMAKRISHNA S.S.
- వార్ 2 లో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ . . ?
- హృతిక్ రోష‌న్ తో సీన్లు నెక్ట్స్ లెవ‌ల్లో నే . . ?
- ఎన్టీఆర్ పెర్పామెన్స్ కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాల్సిందే .. !
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న వార్-2 సినిమా తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ యేడాది దేవ‌ర లాంటి సూప‌ర్ డూప‌ర్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా త‌ర్వాత ఈ యేడాది రెండు సినిమా ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ టాప్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండియ‌న్ సినీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ? అని ఒక్క‌టే ఉత్కంఠ తో అంద‌రూ వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తారా ? అన్న ఉత్కంఠ అయితే అంద‌రి లోనూ ఉంది. పైగా ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో తో క‌లిసి చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా వార్ 2 సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వార్ - 2 మూవీలో ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్‌. ఇక సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉంట‌బోతోంద‌ట‌. అలాగే  హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయ‌ని అంటున్నారు. ఏదేమైనా వార్-2 సినిమా లో ఎన్టీఆర్ రోల్‌పై వస్తున్న వార్తలతో అభిమానులు అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: