తెలంగాణ: సంచలన ఫలితాలు ఖాయం.. మౌత్‌టాక్‌ ఆ పార్టీకి బాగా కలిసొచ్చిందా?

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. పోటా పోటీగా ప్రచారం నిర్వహించి గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు మూడు పార్టీల నాయకులు. అధికారంలో ఉన్నాం ఆరు గ్యారంటీలు కలిసి వస్తాయని కాంగ్రెస్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని బీఆర్ఎస్, మోదీ ప్రభంజనం ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారం చేసిన తమకు అనుకూలంగా మారుతుందని కాషాయ దళం ఇప్పుడు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు.

అయితే ఇంతకీ తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాబోతున్నాయి. ప్రజలు పై మూడు అంశాల్లో ఎటు వైపు మొగ్గు చూపారు. ఎవరికీ పట్టం కట్టారు అంటే ప్రస్తుతం ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తం మీద ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయి అని విశ్లేషకులు అంచనా వేసుకుంటున్నారు.

ఈ సారి పక్కాగా డబల్ డిజిట్ సీట్లు వస్తాయని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశాలు మనం పరిశీలిస్తే.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదనే భావన తెలంగాణ ప్రజల్లో వ్యక్తం అయింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ లేదు. ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఉపయోగం లేదు. తెలంగాణ హక్కులు కాపాడాలన్నా.. తెలంగాణ వాణి వినిపించాలన్నా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసినా ప్రజలు పెద్దగా మొగ్గు చూపలేదు.

దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అవకాశం ఉంటే తాను కూడా ప్రధాని అవుతానని తెలంగాణ ప్రజల మూడ్ ని మార్చే ప్రయత్నం చేశారు.  కానీ ఇవేమీ వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. దేశంలో మోదీని ప్రధానిగా చూడాలని అనుకున్నవారితో పాటు బీజేపీ శ్రేణులు ఆ పార్టీకి ఓటు వేశారు. ఇంక కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదని భావించిన వారు సైతం కాషాయ పార్టీకే అనుకూలంగా ఉన్నారని అర్థం అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఓటర్లు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ  అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్తే బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: