బీజేపీని కాపాడేందుకు రంగంలోకి ఆర్ఎస్‌ఎస్‌?

దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఈ రిజర్వేషన్లపై చర్చ మరింత ఎక్కువ అవుతుంది. తాజాగా లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రిజర్వేషన్లపై మాటల యుద్ధం ఎప్పుడూ సాగుతూనే ఉంది. రిజర్వేషన్లకు తొలగించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని.. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్ఎస్ ఆరోపిస్తోంది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశాన్ని హిందూ దేశంగా చూడాలనుకుంటోందని.. అందుకే బీజేపీని అస్త్రంగా మార్చుకుందని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి లు అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో ప్రధాని  మోదీ.. హోం మంత్రి అమిత్ షాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలపై సర్జికల్ స్ర్టైక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ కూడా రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. ఎస్ఈ, ఎస్టీ, ఓబీసీలకు ఆ పార్టీ వ్యతిరేకం అన్నారు. కర్ణాటకలో ముస్లింలను ఓబీసీల్లోకి చేర్చడాన్ని మోదీ తప్పు పట్టారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇచే చేస్తుందని.. ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి దేశ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇలా రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వాడీ వేడీ చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ పేరు వినిపిస్తోంది.  ఈ రిజర్వేషన్లపై కుట్ర ఆర్ఎస్ఎస్ పనేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తోందని.. అది కల్పించిన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. అవసరం ఉన్నంత కాలం వాటిని కొనసాగించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటుందని వివరించారు. సమ సమాజ స్థాపన జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాలని మోహన్  భగవత్ స్పష్టం చేశారు. తమ సంస్థపై చేసే తప్పుడు ఆరోపణలను నమ్మొద్దని ప్రజలను కోరారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి.. సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: