చంద్రబాబు: ఆ ఒక్క వాగ్దానంతో వాలంటీర్లంతా కూటమిలోకి?
రెండిందాల లాభసాటిగా ఉన్న ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్ క్రియేటర్ అయ్యారు. ఈ విధానంతో పరిపాలనా సంస్కరణలో ఇది ముందడుగు అనే చెప్పాలి. ఈ వ్యవస్థ మీద ఎన్ని విమర్శలు ఉన్నా ప్రజలకు మాత్రం బాగా కనెక్ట్ అయింది. దీని మీద విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. జనాలు మాత్రం పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో టీడీపీ మాత్రం వాలంటీర్ వ్యవస్థపై ఘాటైన విమర్శలు చేసింది.
ఇంట్లో మగవారు లేని సమయంలో వాలంటీర్లు ఇంట్లోకి ఎలా వస్తారని అక్కడ వారికి ఏం పని అని ప్రశ్నించారు. అలాగే వాలంటీర్లను ఇంట్లోకి రానీయోద్దని అని పిలుపు కూడా ఇచ్చింది. మరోవైపు జనసేన అయితే వారిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని అని విమర్శలు చేసింది. దీని మీద ఆద్యంతం ఎంతో రచ్చ జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఈసీ ఆంక్షల నేపథ్యంలో వాలంటీర్లు విధులకు దూరంగా ఉంటున్నారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.
అయితే దీనిపై నష్ట నివారణ చర్యలు చేపట్టిన చంద్రబాబు తాజాగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు నెలకు రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా తమ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వీరికి నెలకు రూ.10వేల గౌరవ భృతి ఇస్తామని ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గతంలో అన్నేసి మాటలు అన్న చంద్రబాబు ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి.. యూ టర్న్ తీసుకొని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పడం ఆయన అవకాశ వాదానికే చెల్లింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మాత్రం ఇక వాలంటీర్లంతా కూటమిలో చేరిపోయినట్టేనని కలలు కంటున్నారు.