ఇద్దరు స్టార్ హీరోల వల్ల ఇరకాటంలో పడిపోయిన త్రిష.. రెండింటికి ఒకే పరిస్థితి..?

Pulgam Srinivas
తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో త్రిష ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయవంతమైన సినిమాలలో హీరోయిన్గా నటించి ఇప్పటికీ కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్గా తమిళ ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తుంది. ఇక తెలుగులో ఈమె అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది.

కానీ ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు లో భారీగా సినిమాలు చేయడం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈమె నటించిన ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల కాలేదు. కేవలం ఈ ముద్దు గుమ్మ నటించిన బృంద అనే వెబ్ సిరీస్ మాత్రమే ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో చిరంజీవి హీరో గా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయడం లేదు సరికొత్త తేదీని మరికొన్ని రోజుల్లో విడుదల చేస్తాం అని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ముద్దుగుమ్మ తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా రూపొందుతున్న విడ ముయార్చి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఇలా రెండు సార్లు ఇద్దరు స్టార్ హీరో ల వల్ల ఈ ముద్దుగుమ్మ సంక్రాంతి రేసులో లేకుండా పోయింది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: