హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రేక్షకాధారణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు.అయితే ఈ సినిమా కు ప్రిక్వెల్ గా ముఫాసా : ది లయన్ కింగ్’వచ్చింది. ‘ముఫాసా : ది లయన్ కింగ్’. పేరుకి ఇది హాలీవుడ్ చిత్రం. కానీ టాలీవుడ్ లో ఈ సినిమాకి మీడియం రేంజ్ హీరోకి ఎలాంటి హైప్ ఉంటుందో, అలాంటి హైప్ ఉన్నింది. కారణం ఒక్కటే, సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ అందించడం. ఈ సినిమా విడుదల రోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్స్ వేశారు, బాణ సంచాలు కాల్చారు, స్పెషల్ షోస్ వేశారు, మహేష్ బాబు రీ రిలీజ్ చిత్రాలకు అభిమానులు ఎలాంటి సంబరాలు అయితే చేస్తారో, అలాంటి సంబరాలన్నీ ఈ చిత్రం కోసం చేసారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. థియేటర్ వద్దకు ముఫాసా తో పోలి ఉన్న పిల్లి బొమ్మని అభిమానులు తీసుకొచ్చి సందడి చేయడం ఎంత వైరల్ అయ్యిందో మనమంతా చూసాము.
అలా ఈ చిత్రానికి బోలెడంత హైప్ తీసుకొచ్చారు మహేష్ ఫ్యాన్స్. ఆ హైప్ కారణంగా ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా డీసెంట్ గానే వచ్చాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో ఇప్పటి వరకు పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి సిటీస్ లో మంచి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇప్పటుకీ థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ బయటకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి డిస్నీ + హాట్ స్టార్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. హాలీవుడ్ చిత్రాలను ఎక్కువ శాతం వాళ్ళే కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్ని క్రేజీ మూవీస్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ కి వెళ్తుంటాయి.
అయితే ఈ సినిమాని హాట్ స్టార్ లో మార్చి, 2025 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకి చిన్న పిల్లల్లో చాలా మంచి క్రేజ్ ఉంది. ఎన్ని కొత్త సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ, పిల్లల కారణంగా ఆడియన్స్ పుష్ప 2 తర్వాత ముఫాసా కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. థియేటర్స్ లో ఆ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి ఓటీటీ లో అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇంగ్లీష్ మరియు ఇతర విదేశీ భాషలతో పాటు, మన భారత దేశ అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం హాట్ స్టార్ లోకి అందుబాటులో రానుంది. తెలుగు లో ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్తే, హిందీ లో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. అలాగే తెలుగులో మిగిలిన పాత్రలకు బ్రహ్మానందం, అలీ వంటి వారు డబ్బింగ్ చెప్పారు.