2027 దాకా అల్లు అర్జున్ కనబడటం కష్టమే ?

Veldandi Saikiran
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు ఈ సినిమా రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల రికార్డులను క్రాస్ చేసింది. కాగా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. 


ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమా కథను పూర్తిచేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక ప్రయోగాత్మకమైన పీరియాడికల్ డ్రామా జోనర్  ఫాంటసీ సినిమాగా త్రివిక్రమ్ ఈ సినిమాను తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. స్వాతంత్రం రాకముందు జరిగిన కొన్ని అంశాలను హ్యూమన్ టచ్ తో హైలెట్ చేయబోతున్నారట. కాగా మైథాలాజికల్ టచ్ తో నిర్మిస్తున్న సినిమా ఇది కావడం విశేషం.


ఈ సినిమా షూటింగ్ కోసం త్రివిక్రమ్ 15 నెలల సమయాన్ని కేటాయించారు. రఫ్ గా చిత్రీకరణకు అంత సమయం పడుతుందని సభ్యులు భావిస్తున్నారు. పాన్ సినిమా కాబట్టి 15 నెలలకు మించే పడుతుందని టాక్ వినిపిస్తోంది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువగా సమయం పడుతుంది. వీటన్నింటినీ చూసినట్లయితే ఈ సినిమా 2026 ఎండింగ్ లో లేదా 2027 ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, పూజా హెగ్డే నటించనున్నారట. అల్లు అర్జున్, పూజ హెగ్డే కలిసి ఇదివరకే చాలా చిత్రాలలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: