అలాంటి వీడియో షేర్ చేసిన అనిల్ రావిపూడి..ఒక్క దెబ్బతో సోషల్ మీడియాని మడతపెట్టేశాడు..!

Thota Jaya Madhuri
ఇప్పటి కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  వినియోగం ఎలా వేగంగా పెరుగుతుందో మనం రోజూ కళ్లారా చూస్తూనే ఉన్నాం. వినోదం కోసం గానీ, విజ్ఞాన అభివృద్ధి కోసం గానీ ఈ ఏఐ ని ఉపయోగిస్తే అది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. కానీ అదే టెక్నాలజీని తప్పు దారిలో లేదా దుర్వినియోగం చేస్తే, దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ ఆధారంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ లేటెస్ట్ ట్రెండ్‌లో ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపూడి కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో “మన శంకర వరప్రసాద్ గారు” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.



ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తాజాగా ఒక క్రేజీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి… ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు” అంటూ క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఈ వీడియోలో, ఒకే ఫ్రేమ్‌లో ఖైదీ చిరంజీవి నుంచి మొదలుకొని గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి పలు ఐకానిక్ సినిమాల్లోని చిరంజీవి పాత్రలను చూపిస్తూ, చివరగా తన దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” వరకు తీసుకెళ్లిన విధానం ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది.



ఈ వీడియో డిజైన్ మొత్తం కూడా చాలా క్రియేటివ్‌గా ఉండటమే కాకుండా, మెగాస్టార్ సినీ ప్రయాణానికి ఒక అందమైన గుర్తుగా కనిపిస్తోంది. ఒక అభిమాని కోణంలో చిరంజీవిని చూస్తూ పెరిగిన అనీల్ రావిపూడి, ఇప్పుడు అదే చిరంజీవిని డైరెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నాననే భావాన్ని ఈ వీడియో ద్వారా చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు. ఇలా ఏఐ ట్రెండ్‌ను వినూత్నంగా ఉపయోగిస్తూ తన సినిమాకు కూడా మంచి ప్రమోషన్ అందించారు అనిల్ రావిపూడి. ఫలితంగా ఈ పోస్ట్ మెగాస్టార్ ఫ్యాన్స్ మధ్య వేగంగా వైరల్‌గా మారింది. చిరంజీవి అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ, దర్శకుడి క్రియేటివిటీకి, అలాగే మెగాస్టార్ లెగసీకి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, ఏఐను సరైన దిశలో వినియోగిస్తే ఎలా పాజిటివ్‌గా మారుతుందో చెప్పే మంచి ఉదాహరణగా ఈ వీడియో నిలిచిందని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: