కాబోయే భార్యతో అక్కినేని హీరో మిర్రర్ సెల్ఫీ.. అదిరిపోయిందిగా..!
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు బైనస్ రవ్జి.. వీరి వివాహం ఏడాది జరగబోతోంది అంటూ నాగార్జున కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.. 2024 తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన ఇయర్ అని ఏఎన్నార్ శతజయంతి వేడుకలు జరగడంతో పాటు తమ కొడుకులు ఇద్దరు జీవితంలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని నాగార్జున వెల్లడించారు. అయితే అఖిల్ వివాహ తేదీని మాత్రం తెలుపలేదు. నాగచైతన్య వివాహంలో అఖిల్ బైనబ్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. అయితే ఇప్పుడు తాజాగా వీరిద్దరూ కలిసి ఒక మిర్రర్ సెల్ఫీ దిగడంతో సోషల్ మీడియాలో ఫోటో వైరల్ గా మారుతున్నది.
న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ అఖిల్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ ని సైతం షేర్ చేశారు ఇందులో కొత్తజంట చాలా క్రేజీగా వైట్ అండ్ వైట్ దుస్తులలో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. అయితే నాగచైతన్య పెళ్లిలో తీసుకున్న పిక్ అన్నట్లుగా ఇది సమాచారం. అయితే ఈ ఫోటోలకు అభిమానుల సైతం క్యూట్ అండ్ లవ్లీ కపుల్స్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది పెళ్లెప్పుడు అఖిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బైనబ్ కుటుంబానికి వివిధ ప్రాంతాలలో బిజినెస్ లు ఉన్నాయట. వీరిద్దరిది ప్రేమ వివాహం అన్నట్టుగా సమాచారం.