సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఆయన తనతో ఒక సినిమా తీసి అద్భుతమైన విజయాలు అందించిన దర్శకులకు రెండో అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అలా రెండో అవకాశం ఇచ్చిన దర్శకులలో చాలా మంది దర్శకులు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయారు. అలా మహేష్ తో రెండవ సినిమా తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయనకు ఫెయిల్యూర్ ను అందించిన దర్శకులు ఎవరో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మహేష్ బాబు , శ్రీను వైట్ల కు రెండవ అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా ఈ దర్శకుడు మహేష్ తో ఆగడు అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొంది. మహేష్ బాబు , వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. దానితో మహేష్ బాబు ఈ దర్శకుడికి రెండవ అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా ఈయన మహేష్ తో బ్రహ్మోత్సవం అనే సినిమాను రూపొందించాడు.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం గుణశేఖర్ , మహేష్ తో ఒక్కడు అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దానితో మహేష్ ఈ దర్శకుడితో అర్జున్ , సైనికుడు అనే సినిమాలను చేశాడు. అర్జున్ మూవీ కాస్త పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న సైనికుడు సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా మహేష్ కొంత మంది దర్శకులకు రెండవ అవకాశం ఇవ్వగా అందులో చాలా మంది తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయారు.