విశ్వంబర మేకర్స్ ఆ సూపర్ సెంటిమెంట్‌ను ఫాలో కానున్నారా..?
మెగాస్టర్
చిరంజీవి చాలా కాలం క్రితమే మల్లాడి వశిష్ఠ దర్శకత్వం లో విశ్వంభర అనే
మూవీ ని మొదలు పెట్టాడు . ఈ సినిమాను స్టార్ట్ చేసిన కొద్దీ రోజులకే ఈ మూవీ ని 2025
సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు . ఇకఈ సినిమాకి
బారి గ్రాఫిక్స్ పనులు ఉన్నాయని అవి అనుకున్న టైం కి పూర్తి కావడం లేదు అని ఈ సినిమాని 2025
సంక్రాంతి కి కాకుండా వేరే సమయములో విడుదల చేస్తాము అని మేకర్స్ ప్రకటించారు . ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ సినిమాని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నాము అని
చిరంజీవి అధికారికంగా ప్రకటించాడు.
దానితో ఈ సినిమాను ఈ ఇయర్ మే లో విడుదల చేసే అవకాశం ఉంది అని చాల మంది అభిప్రాయ పడ్డారు. ఇక ప్రసుత పరిస్థితులను బట్టి చుస్తే ఈ
మూవీ ఈ సమ్మర్ లో కూడా విడుదల కావడం కష్టం అని తెలుస్తుంది. ఈ
మూవీ ని ఈ సమ్మర్ లో రిలీజ్ చేయకపోయినా కూడా
మెగా ఫామిలీ కి సూపర్ గా కలిసి వచ్చిన నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఈ
మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జులై నెలలో విడుదల అయినా ఎన్నో మెగా హీరోల మూవీలు మంచి విజయాలను సాధించాయి. ఇక విశ్వంభర
మూవీ ని కూడా ఈ జులై 10 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక విశ్వంభర
మూవీ తర్వాత
చిరంజీవి మన శంకర వార
ప్రసాద్ మూవీని మొదలు పెట్టాడు. ఈ మూవీ ని తాజాగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.