ఏపీ: అప్పులలో ఆంధ్ర.. సూపర్ సిక్స్ అట్టకెక్కినట్టేనా..?
వీటికి తోడు సీఎం చంద్రబాబు వేలకు వేలకోట్లు అప్పు చేస్తూనే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ వార్తాపత్రికలో తెలిపిన సమాచారం మేరకు.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 1.19 లక్షల కోట్ల రూపాయలు అప్పు.. సూపర్ సిక్స్ హామీలు ఎక్కడున్నాయి అన్నట్టుగా ప్రశ్నిస్తోంది. ఇంత అప్పు చేసిన కూడా ఈ పథకాలను అమలు చేయడం లేదు కదా అంటూ ప్రముఖ న్యూస్ పేపర్లలో ఒకటైన సాక్షి కూడా ప్రశ్నించడం జరిగింది. జగన్ గతంలో ఇచ్చిన పథకాలను కూడా నిలిపివేశారు అంటూ ప్రశ్నించారు.
విద్యార్థులకు అమ్మ ఒడి, వసతి దీవెన, ఫీజులు, రైతన్నలకు భరోసా కరువైంది.. ఆస్పత్రికి వెళితే ఆరోగ్యశ్రీ లేదు.. బకాయిలు చెల్లించకుండా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోంది అంటు.. బడ్జెట్, బడ్జెటేతర అప్పులతో కలిపి రాష్ట్రం పై పెనుబారం మోపింది కూటమి సర్కార్(చంద్రబాబు) అంటూ ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్లో చెప్పిన వాటికి మించి ఆర్థిక రుణాలు, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే.. గీత దాటి అప్పులు చేసేస్తున్నారని.. అమరావతి కోసం ఇప్పటికే 31 వేల కోట్ల అప్పు, మరొక 21 వేల కోట్లు సమీకరించాలని సిఆర్డిఏ కి ప్రభుత్వం ఆదేశం జారీ చేసిందంటూ తెలిపారు. గతంలో జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలతో ఏపీ శ్రీలంక అవుతుందన్న చంద్రబాబుకు సపోర్ట్ చేస్తూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు అసలు పట్టించుకోలేదంటూ వార్తని హైలెట్ చేస్తోంది ఈ వార్త పత్రిక.