"మాట వినాలి" అంటున్న పవర్ స్టార్.. వీరమల్లు న్యూ ఇయర్ అప్డేట్ అదిరిందిగా..!!

murali krishna
ఏపీ డిప్యూటీ సీఏం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎందగానో ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ అప్‍డేట్ల కోసం నిరీక్షిస్తున్నారు. గత ఏడాది ఈ మూవీ రిలీజ్ అవుతుందని అందరు అనుకున్నారు కానీ ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనలేదు. దాంతో మూవీ పెండింగ్ ఉంది. అందుకే సినిమాలు అనుకున్న టైం కు రిలీజ్ చెయ్యలేకపోయారు. ఈ మూవీ నుంచి న్యూయర్ సర్ ప్రైజ్ ను ఫ్యాన్స్ కు ఇచ్చారు మేకర్స్.. జనవరి 1న మూవీ టీమ్ అదిరిపోయే విషయం చెప్పింది. తొలి పాట రిలీజ్ డేట్, టైమ్ వెల్లడించింది. ఈ పాటను స్వయంగా పవన్ కల్యాణ్ పాడారు. కొత్త పోస్టర్‌తో పాటు సాంగ్ వివరాలను ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. ఆ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి..
హరి హర వీరమల్లు మూవీ నుంచి ‘మాట వినాలి’ అంటూ తొలి సాంగ్ రానుంది. ఈ పాట జనవరి 6వ తేదీన ఉదయం 9 గంటల 6 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా అనౌన్స్ చేసింది. 2025 పవర్ ప్యాక్డ్‌గా ఉండనుంది. హరి హర వీరమల్లు నుంచి తొలి పాటతో కొత్త సంవత్సరాన్ని సెలెబ్రేట్ చేసుకోండి. ఫస్ట్ సాంగ్ జనవరి 6వ తేదీ ఉదయం 9:06 గంటలకు వస్తుందని ఆ మూవీ ప్రొడక్షన్  టీమ్ పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా తన గాత్రంతో పాడారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అదిరిపోయే అప్‍డేట్ ఇచ్చారు. జనవరి 6న వచ్చే ఈ పాట కోస పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈ పాట అనౌన్స్మెంట్ తో పాటుగా పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ యోధుడు గా కనిపిస్తున్నారు. చలిమంట దగ్గర కూర్చున్నాడు. ఈ పోస్టర్ అట్రాక్టివ్‍గా ఉంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28వ తేదీన విడుదల అవుతుందని ఈ పోస్టర్‌లో మరోసారి కన్ఫర్మ్ చేసింది వీరమల్లు టీమ్..
ఈ మూవీకి మొదటగా డైరెక్టర్ క్రిష్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయనను నిర్మాతలు తప్పించారు. ప్రస్తుతం ఈ మూవీకి నిర్మాత కుమారుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా ఉన్నారు. మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఇంకా 8 రోజుల షూటింగే పెండింగ్‍లో ఉందని పవన్ ఇటీవల చెప్పారు. హరి హర వీరమల్లు మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్‍జీత్ విర్క్, నోరా ఫతేహి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: