ఏపీ: బాబును ఒక రోజు సీఎం చేస్తే.. చేసిచూపిస్తారట?

టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధిగా పట్టాభి రాం అందరికీ సుపరిచితమే. గతంలో ఆయన కార్మిక సంఘాల  తరఫున పోరాటాలు చేశారు. బుద్దా వెంకన్న ప్రధాన అనచరుడిగా ఉంటూ..ఆ తర్వాత ఆయనకే సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయికి చేరారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సమయంలో ఆ పార్టీ నేతలు దాడి చేశారు. ఈ సందర్భంలో ఆయన ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబు పరామర్శించారు.

ఇదంతా తనకు రాజకీయంగా ఉపయోగపడుతుందని భావించారు. గన్నవరం సీటు వస్తుందని అంచనా వేశారు. కానీ టీడీపీ లిస్ట్ లో ఆయనకు నిరాశే ఎదురైంది. తాజాగా ఆయన సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్.. సీఎంగా 24 గంటలు తప్పుకుంటే చంద్రబాబు నేతృత్వంలో ఒక్క రోజులో పెన్షన్ లును పంపిణీ చేసి చూపిస్తాం అంటూ ఆయన సవాల్ విసిరారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ భవన్ టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు సీఈవో, సీఎస్ లను ఇంటింటికీ పెన్షన్ పంపిణీ విఘాతం కలగకుండా చూడాలని మాత్రమే కోరారు. జగన్ కు రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే అర్థమై టీడీపీపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలను నియమించింది. వీరికి డబ్బులను ఒక్కరోజులోనే పంపిణీ చేశారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు ఎలా ఒక్క రోజులో చేస్తారని అడుగుతున్నారు. రోజూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సచివాలయాల చుట్టూ తిరిగేవారు. ఈ సమయంలో రోజుకి పది మంది చొప్పున పింఛన్లు పంపిణీ చేసేవారు. అప్పుడు సాధ్యం కానిదీ ఇప్పుడు వాలంటీర్లు లేకుండా ఎలా సాధ్యం చేసి చూపిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటింటికీ వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి.. అప్పట్లో తమ హయాంలో వారంపాటు పింఛన్లు పంపిణీ చేసి ఇప్పుడు మీరు తప్పుకోండి మేం 24గంటల్లో చేసి చూపిస్తాం అంటే అర్థరహితంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: