పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన వచ్చినట్టేనా?

పాకిస్తాన్ అంటే పాకిస్తానే.. అక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యమే.  ఆర్మీ అధికారంలో ఉంటుందా.. రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటాయా అంటే ఎవరూ చెప్పలేరు.  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలగింపు, జైలుకు పంపించిన తర్వాత ఫిబ్రవరి 8న అక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాయి. కానీ మరోవైపు అప్రజాస్వామికంగా అక్కడ ఆర్మీ అధికారులు రిగ్గింగ్ చేస్తున్న వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.

పాకిస్తాన్ రూరల్ ప్రాంతాల్లో ఏ పార్టీకి పట్టుంటే ఆపార్టీ కార్యకర్తలు.. హోటల్ బిల్లు బుక్కుపై రబ్బరు స్టాంపులా.. పోలింగ్ బూతుల్లో బ్యాలెట్లపై ఓట్లు గుద్దుకున్నారు. ఏ మాత్రం టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా బ్యాలెట్ బాక్సుపైనే కూర్చొని బ్యాలెట్ పేపర్లపై తమకు కావాల్సిన గుర్తుపై ఓట్లేసుకున్నారు. దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇంతోటి రిగ్గింగ్ కు ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గ్రేట్ పాకిస్తాన్.. రిగ్గింగ్ పోలింగ్.. రిగ్గింగ్ లో ప్రపంచ రికార్డు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా చివరకు పాకిస్తాన్ లో మిగిలేది బూడిదే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బెలూచిస్తాన్ లో వరుసగా బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు బాంబు పేలుళ్లు. ఈ దాడుల్లో సుమారు 30 మంది చనిపోయినా ఆ దేశానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు.

పాక్ పై సైన్యం పెత్తనం, ఐఎస్ఎస్ పెత్తనం స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తప్పించారు. న్యాయ వ్యవస్థలో ముందు కొంత ఉపశమనం లభించినా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వరుస పెట్టి జైలు శిక్షలు విధిస్తున్నారు. నవాబ్ షరీఫ్ ను తీసుకొచ్చి పీఠంపై కూర్చో పెట్టాలని పాక్ సైన్యం,  ఐఎస్ఎస్ భావిస్తున్నాయి. వాళ్లకు అనుకూల వ్యక్తి ప్రధాని పదవిలో ఉండాలి. లేకపోతే వారిని తీసేసి జైలులో పెడతారు. ఫలితం పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో సైనిక పెత్తనం తప్పదన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: