ఆ రెండు అస్త్రాలు జగన్‌ను మళ్లీ గెలిపిస్తాయా?

వచ్చే ఎన్నికల్లో కచ్ఛితంగా గెలిచేందుకు ఏపీ సీఎం జగన్ చాలానే వ్యూహాలు రచిస్తున్నారు. గెలవడం అంటే మామూలు మెజార్టీ కాదు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే భారీ మెజార్టీ సాధించాలని పెద్ద ప్లానే వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇందులో బీసీ సామాజిక వర్గానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వచ్చిన జాబితాల బట్టి అర్థం అవుతుంది.

అయితే ఎన్నికల్లో ఎన్ని అస్త్రాలు వాడాలో అన్నింటిని అన్ని పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాబోయేది కురుక్షేత్రమేనని అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్ పేర్కొంటున్నారు. ఎవరికి వారు ఎదుటి వారు కౌరవులు, మేం పాండవులం అని చెబుతున్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా చివరకు ప్రజలు ఒకర్ని డిసైడ్ చేస్తారు. దాని కోసం ఎదురు చూడాల్సిందే.  అయితే జగన్ ఈ సారి రెండు ప్రధాన అస్త్రాలతో ప్రయోగిస్తున్నారని చూస్తుంటే తెలుస్తోంది.

అందులో ఒకటి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయడంతో పాటు వాటిని మీ ఇంటి దగ్గరికీ నేరుగా వచ్చి మేమే అందిస్తున్నాం. గ్రామాల్లో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనను సులభతరం చేసి మీ ఇంటికే తీసుకువచ్చాను. సంక్షేమం పథకాలు కూడా ఎటువంటి పైరవీలు లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాను. నా వల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ప్రజలను ఆలోచింపచేస్తున్నారు.

ఇక రెండోది అన్నింటికన్న ముఖ్యం సోషల్ ఇంజినీరింగ్.  ఎప్పటి నుంచో బీసీలు టీడీపీకి మద్దతుగా ఉన్నారు.  ఈ సారి వారిని తన వైపు తిప్పుకునేందుకు జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నారు.  ఇప్పటి వరకు బీసీలకు సీట్లు ఇచ్చినా.. ఎక్కువ శాతం డబ్బులు ఉన్న నేతలకు మాత్రమే టికెట్లు ఇచ్చేవారు. కానీ ఈసారి 16 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో తొమ్మిందింటిని బీసీలకే కేటాయించి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు సంక్షేమం, ఇటు సోషల్ ఇంజినీరింగ్ అనే రెండు అస్త్రాలతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: