అదిరిపోయే టైటిల్ తో రాజా సాబ్ -2..ఆ పాత్రలో ప్రభాస్.!

Pandrala Sravanthi
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో వచ్చిన తాజా మూవీ ది రాజా సాబ్..హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రీమియర్స్ తోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమందేమో ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటే.. మరి కొంతమంది సినిమా డిజాస్టర్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఇక వీరిలో ప్రభాస్ అభిమానులకు సినిమా నచ్చింది.కానీ మిగతా వారిని సినిమా అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. కచ్చితంగా రాజా సాబ్ సినిమా ప్లాప్ అవుతుందని రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి నుండి ఇంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేమని, ఆయన నుండి ఈ మాత్రం రావడమే ఎక్కువా అంటూ నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. అలాగే ప్రభాస్ తన పాత్రకి 100% న్యాయం చేసినప్పటికీ డైరెక్టర్ డైరెక్షనే బాలేదని, మారుతి ప్లేస్ లో మరో డైరెక్టర్ అయితే సినిమా అద్భుతంగా ఉండేదని చాలామంది రివ్యూ ఇస్తున్నారు.


 ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సీక్వెల్స్,ప్రీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ది రాజా సాబ్ సినిమాకి కూడా మరో పార్ట్ ఉంటుంది అని చివర్లో చిత్ర యూనిట్ అధికారికంగా స్క్రీన్ పై చూపిస్తూ హింట్ ఇచ్చేశారు. ముఖ్యంగా ఇంతకుముందు విడుదలైన ది రాజా సాబ్ సినిమాలో చూపించిన చాలా సీన్స్ ఇందులో కనిపించలేదు. బహుశా ఈ సినిమాకి సంబంధించిన ప్రీక్వెల్ లేదా సీక్వెల్ లో ఈ సీన్స్ కనిపిస్తాయేమో.. అయితే ది రాజా సాబ్ సినిమాకి పార్ట్ -2 కి సంబంధించిన టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. అదేంటంటే రాజా సాబ్ సర్కస్ : 1935 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.


 అయితే టైటిల్ చూస్తూ ఉంటే ఈ సినిమాకి ప్రీక్వెల్ ఉంది అని అర్థమవుతుంది. ఇక ది రాజా సాబ్ సినిమాకి చివర్లో ప్రభాస్ పాత్రకి ఎక్కువ లీడ్ ఇస్తూ సీక్వెల్ కూడా ఉంటుంది అన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఇక ఇది చూసి ఈ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే ట్రైలర్ లో చూపించిన సీన్స్ అన్నీ కూడా పార్ట్-2 లో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవ్వడంతో మొదటి పార్టే బాలేదు. ఇక రెండో పార్ట్ ను ఎవరు చూస్తారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్, బొమన్ ఇరానీలు కీ రోల్స్ పోషించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: