ఎన్టీఆర్:డ్రాగన్ సినిమాపై అప్డేట్.. ఏకంగా 100 మంది ఫైటర్లతో..?

Divya
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నపడినట్టుగా ఇటీవలే పలు రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోనే కాకుండా ఇతర విదేశాలలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పుడు తాజాగా హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అది కూడా 1969 కాలంలో చైనా, భూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాలలో సాగేటువంటి సీన్స్ ని చిత్రీకరిస్తున్నట్లు  వినికిడి. ఇందుకు సంబంధించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతొంది. ఈ సీన్స్ కి సంబంధించి  షూటింగ్ సెట్ RFC లో సైలెంట్ గా షూటింగ్ జరిగిందని ఇందుకోసం ఒక భారీ ఫారెస్ట్ సెట్ ను కూడా నిర్మించి అందులో వందలాదిమంది ఫైటర్లతో యాక్షన్ సీన్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించినట్లుగా వినిపిస్తోంది. ఈ సీన్ డ్రాగన్ సినిమాకి హైలెట్ అవ్వచ్చు అనే ఆ విధంగా వినిపిస్తున్నాయి.


ఈ సినిమా షూటింగ్ ను ఎంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ ను మొదలుపెట్టి ఈ ఏడాది జూన్ 25వ తేదీన విడుదల చేసేలా చిత్ర బృందం ఆలోచిస్తోందట. అయితే ఇప్పటివరకు కేవలం ఈ సినిమా నుంచి అధికారికంగా పోస్టర్లే తప్ప ఎటువంటి టీజర్, గ్లింప్స్ విడుదల చేయలేదు. మరి సంక్రాంతి కానుకగా అభిమానుల కోసం ఏదైనా సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారేమో చూడాలి మరి. ఎన్టీఆర్ గత ఏడాది వార్ 2 తో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఈసారి డ్రాగన్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: