తెలంగాణలో ఆ 10 జిల్లాలు రద్దు.. సిద్దిపేట సిరిసిల్లతో పాటు.?

Pandrala Sravanthi
తెలంగాణలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా తాజాగా తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయం మాత్రం కొంతమందికి నచ్చడం లేదు. అదేంటంటే..త్వరలోనే కొత్తగా ఏర్పాటైన ఈ పది జిల్లాలను రద్దు చేయబోతుందట. ముఖ్యంగా ఈ పది జిల్లాల్లో బీఆర్ఎస్ టాప్ రాజకీయ నాయకులకు పట్టు కూడా ఉంది. మరి ఇంతకీ ఆ జిల్లాలు ఏంటి ..నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం.. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని స్పష్టం చేశారు. 


ఇందులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు ఏర్పడి 33 కి సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు ఉన్న 33 జిల్లాలలో 10 జిల్లాలను రద్దు చేసి 23 జిల్లాలకు కుదించే ప్రయత్నాలు చేస్తున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం.ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, నారాయణపేట తో పాటు మరో ఆరు జిల్లాలను రద్దుచేసి ఈ జిల్లాలను ఆ పక్కనే ఉన్న పెద్ద జిల్లాలలో కలిపేయాలని ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సిద్దిపేట ను మెదక్లో, సిరిసిల్లను కరీంనగర్లో కలుపుతారేమో అని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే ములుగు ని వరంగల్ జిల్లాలో కలిపేస్తారని అంటున్నారు.


ఒకవేళ ఇదే నిజమైతే మళ్లీ ప్రజలకు పాట్లు తప్పవు. అంతేకాకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ప్రక్రియ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్యకాలంలో జిల్లాలకు పేర్లు మార్చాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది. అలాగే ఫ్యూచర్ సిటీ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరును పెట్టబోతున్నట్లు సమాచారం. అలా గతంలో రేవంత్ రెడ్డి మేం అధికారంలోకి వచ్చాక జిల్లాల పునః వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పి ఇప్పుడు చేసి చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: