బాబోయ్.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు.. థెఫ్ట్ ఇరిగేషన్?
రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్ ప్రతిపాదించిన పనిని ముచ్చుమర్రి ద్వారా చంద్రబాబు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఎన్జీటీకి సీఎస్ ద్వారా జగన్ అఫిడవిట్ దాఖలు చేయించారని ఆరోపించారు. డీపీఆర్ తయారీ పేరుతో రూ.900 కోట్లు నిధులు మళ్లించారని కేశవ్ వివరించారు. ఇటువంటి నిధుల మళ్లింపును తెఫ్ట్ ఇరిగేషన్ పథకం అనక మరేమనాలని ఆయన ప్రశ్నించారు. డీపీఆర్ స్కీం అని ఒకసారి చెన్నైకి తాగునీరు ఇచ్చే స్కీం అని మరోసారి పొంతనలేని వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 102 రాయలసీమ ప్రాజెక్టులు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని కేశవ్ ఆరోపించారు.
జగన్ రాయలసీమ ప్రాజెక్టులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశామని జగన్ చెప్పడం తప్పుడు మాటలని ఆయన అన్నారు. ముందు డీపీఆర్ పనులు మాత్రమే చేశామని ప్రభుత్వ అఫిడవిట్‌లోనే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ప్రాజెక్టు పేరుతో సేకరించిన రూ.900 కోట్లు మళ్లించారని ఆరోపించారు. గో నెంబర్ 364 ప్రకారం ఈ ప్రాజెక్టును తాగునీరు స్కీమ్‌గా వర్గీకరించారని కేశవ్ తెలిపారు.
198 ఇరిగేషన్ ప్రాజెక్టులు రద్దు చేశారని అందులో 102 రాయలసీమకు సంబంధించినవని వివరించారు. జగన్ రాయలసీమను నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజలను మోసం చేసేలా నాటకాలు ఆడుతున్నారని కేశవ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇకపై జగన్ మాటలు నమ్మరని ఆయన హెచ్చరించారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.