ఆంధ్రా కేజీఎఫ్‌: ఇక ఏపీలోనూ బంగారు గనులు?

ఇప్పటి వరకు మనకు బంగారు గనుల  ప్రస్తావన వస్తే కర్ణాటకలో లోని కోలార్ మైన్స్ గురించే మాట్లాడుకునే  వాళ్ళం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బంగారు గనులు అనేవి ఇప్పటివరకు అందుబాటులో లేవు కాబట్టి. కానీ ఇప్పుడు అది నిన్నటి మాట మాత్రమే.  ఇక రాబోయే కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లోని బంగారు గనుల గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. జొన్నగిరి బంగారుగనుల్లో వచ్చే ఏడాది అక్టోబర్, డిసెంబర్ నాటికల్లా ప్రొడక్షన్ అనేది మొదలవుతుందని అంటున్నారు.

ఈ సందర్భంగా డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ డి జి ఎం ఎల్ ఎండి హనుమ ప్రసాద్ చెప్పేది ఏమిటంటే ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, పూర్తి స్థాయిలో ఈ బంగారు గనులు అందుబాటులోకి వస్తే ఏటా 750 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని ఆయన అంటున్నారు. ఈ బంగారు గనుల నిమిత్తం ఇప్పటివరకు 250 కోట్ల పెట్టుబడిని పెట్టారని ఆయన అన్నారు.  పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం నెలకి ఒక కేజీ బంగారాన్ని వెలికి తీస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

2013లో వాళ్లకి ప్రాజెక్టుని అప్పగిస్తే ప్రాజెక్టు మదింపు అయ్యేసరికి 8 నుండి 10 సంవత్సరాల కాలం పట్టిందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తమకు కిజకిస్తాన్‌లో కూడా 60 శాతం వాటాలు ఉన్నాయని, మరో బంగారు గనుల్లో కూడా 2024 అక్టోబర్ నవంబర్ లో ఉత్పత్తులు మొదలవబోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆల్టిన్ గోల్డ్ ప్రాజెక్టు నుండి ప్రతి సంవత్సరం 400కేజీల బంగారం వెలికి తీయవచ్చు అని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గన్నవరం లోని జొన్నగిరి బంగారు గని బిఎస్ఈ లో లిస్ట్ అయిన ఏకైక గోల్డ్ మైనింగ్ కంపెనీ అని ఆయన అన్నారు.  డీజీఎంఎల్ జొన్నగిరి ప్రాజెక్టుని అభివృద్ధి చేస్తున్నటువంటి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియాలో జీడిఎంఎల్ కు 40శాతం వాటాలు ఉన్న నేపథ్యంలో ఇది మంచి పరిణామమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: